TG24TV
రచయిత
అంగరంగ వైభవంగా PACS చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి ప్రమాణ స్వీకారం
TG24TV
రచయిత
అంగరంగ వైభవంగా PACS చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి ప్రమాణ స్వీకారం

వర్ధన్నపేట, సెప్టెంబర్ 24 (టీజీ 24): వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా ఎన్నికైన అబ్బిడి రాజిరెడ్డి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా మండల కేంద్రంలోని PACS కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అబ్బిడి రాజిరెడ్డి PACS చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.