T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన PACS చైర్మన్ మనోజ్ గౌడ్
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన PACS చైర్మన్ మనోజ్ గౌడ్

పర్వతగిరి, జూలై 26 ( టీజీ 24): పర్వతగిరి మండలం బూర్గుమాళ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సిరిపురపు శ్రీధర్ మాతృమూర్తి కీ.శే. సిరిపురపు సాలమ్మ దశదిన కార్యక్రమానికి PACS చైర్మన్ ఎం. మనోజ్ గౌడ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ జీతేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సాలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జనార్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వేణు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సాయిబాబా, శేఖర్, కుమారస్వామి, అనిల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.