T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కొత్తూరులో కంఠమహేశ్వర స్వామి పండుగలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

కొత్తూరులో కంఠమహేశ్వర స్వామి పండుగలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

కొత్తూరులో కంఠమహేశ్వర స్వామి పండుగలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

రాయపర్తి, జూలై 07 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి దేవాలయ పండుగ ఉత్సవాల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి సుభాష్ నివాసంలో జరిగిన పండుగ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మాజీ సర్పంచ్ కందికట్ల స్వామి, పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఆశ్రఫ్ పాషా, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.