TG24TV
రచయిత
విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 15:(టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ ర్యాంక్ సాధించిన పట్టపురం రచనకు రూ.3,016 నగదు బహుమతితో పాటు షీల్డ్, ద్వితీయ ర్యాంక్ సాధించిన అన్నబోయిన సుహితకు రూ.2,016 నగదు బహుమతితో పాటు షీల్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, స్థానిక సర్పంచ్ చిర్ర వేణు, పాఠశాల హెచ్‌ఎం ఎ. ఉమాదేవి, పార్టీ ముఖ్య నాయకులు గుడెల్లి వెంకటయ్య, గబ్బేట యాకయ్య, సంకినేని ఎల్లస్వామి, వార్డు సభ్యులు పరుపాటి రవీందర్ రెడ్డి, గాడిపెల్లి రాములు, తాటికాయల కేతమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.