T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 12 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఆదేశాల మేరకు సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరోసారి మానవతా సహాయం అందించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుక్కల రాకేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హనుమకొండలోని ఏకాశిల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి రాకేష్‌ను పరామర్శించారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి, చికిత్స అనంతరం చెల్లించాల్సిన డిశ్చార్జ్ బిల్లులో డిస్కౌంట్ ఇప్పించి బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, ముదిరాజ్ సంఘం సర్పంచ్ బాధ అశోక్, పార్టీ ముఖ్య నాయకులు కనుకుట్ల యాకయ్య, బాధ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.