T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బీమని నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బీమని నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బీమని నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, సెప్టెంబర్ 13 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు బీమని అనిల్ తండ్రి బీమని నరేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఆయన కుటుంబ సభ్యులను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా నరేందర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, SRR ఫౌండేషన్ తరఫున 50 కిలోల బియ్యం, ఆయిల్ క్యాన్ అందించి కుటుంబానికి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ కందికట్ల స్వామి, ఉప సర్పంచ్ చిప్ప శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు సంకినేని ఎల్లస్వామి, తాటికాయల భాస్కర్, బీమని యాదగిరి, బీమని రమేష్, గాదె హరీష్, తాటికాయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..