T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 26 (టీజీ 24): : సేవే పరమో ధర్మం అనే లక్ష్యంతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ మరోసారి తన సేవా కార్యక్రమాన్ని కొనసాగించింది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెరాల సదానందం, పెద్దగోని లింగమ్మలను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వారి ఇళ్ల వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, స్థానిక నాయకులు తెరాల యాకయ్య, చిర్ర శ్రీనివాస్, కొండా యాకయ్య, అగారావు, నూనె సుమన్, రాధారపు రాజు, అవిరెండ్ల అశోక్, కన్నీబోయిన రాజు, కూరపాటి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.