TG24TV
రచయిత
నిరుపేద కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
నిరుపేద కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జులై 19 (టీజీ 24): వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గాదె బిక్షపతి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు . రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి రూ 3000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, సంధి దేవేందర్ రెడ్డి, చందు రామ్, బొమ్మినేని సురేందర్ రెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు తెరల యాకయ్య, సర్పంచ్‌లు ఇస్లావత్ సంతోష్, లావుడ్యా నరేష్, మండల పార్టీ నాయకులు చిర్ర శ్రీనివాస్, తెరల సదయ్య గౌడ్, సంకినేని ఎల్లస్వామి, ఐత రవి, పెందోటా శివ, చందు లక్ష్మన్, ఐత జంపి తదితరులు పాల్గొన్నారు.