T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి ఆర్థిక సాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 11 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరోసారి ఆపన్నహస్తం అందించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్ గడ్డం విజయ సమ్మయ్య కుమారుడు గడ్డం హరీష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న హరీష్‌ను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. SRR ఫౌండేషన్ తరఫున రూ.4,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, మచ్చ శ్రవణ్, పెందోట శివ, ఐత జంపి, గారే నరేష్, పీరని రాజు, స్థానిక సర్పంచ్ గడ్డం విజయ సమ్మయ్య, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఊళ్లేంగాల సుధాకర్, పార్టీ ముఖ్య నాయకులు గజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బొంధ్యలు తదితరులు పాల్గొన్నారు.