TG24TV
రచయిత
అలకుంట్ల వెంకటమ్మకు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
అలకుంట్ల వెంకటమ్మకు ఆర్ధిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 11 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, “సేవే పరమో ధర్మం” అనే లక్ష్యంతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అలకుంట్ల వెంకన్న తల్లి అలకుంట్ల వెంకటమ్మ ఇటీవల ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, స్థానిక నాయకులు పుల్ల ఎల్లగౌడ్, దేశబోయిన ఉపేందర్, వీరమనేని సత్యనారాయణ రావు, బోగెల్లి సంపత్ రావు, ఏనబోతుల దేవేందర్, అడ్లూరి శ్రీను, కర్ర ప్రవీణ్ రెడ్డి, నేరెళ్లి రాములు, పట్నం సురేష్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గూడూరు రమేష్, గోలి సంపత్ రెడ్డి, గజ్జి రాజేశ్వరి రాజు తదితరులు పాల్గొన్నారు.