TG24TV
రచయిత
గూబ సోమక్క కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
గూబ సోమక్క కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జులై 31 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు గూబ సోమక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ గూబ సోమక్క కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను అందించి, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిన్నపాక రజిత-రాంబాబు, ఉపసర్పంచ్ చీకటి కర్ణాకర్, మాజీ సర్పంచ్ నలామాష సారయ్య, మండల పార్టీ నాయకులు గూబ అశోక్, వార్డు సభ్యులు రాధికా సంతోష్, అనూష సురేష్, పార్టీ నాయకులు చిన్నపాక శ్రీనివాస్, వెంకన్న, వేణు, సందీప్ రాజు తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.