TG24TV
రచయిత
స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి 20వేలుఆర్ధిక సహాయం చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి 20వేలుఆర్ధిక సహాయం చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, నవంబర్ 22 (టీజీ 24): హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి రాయపర్తి మండలం నుంచి తరలివెళ్తున్న స్వేరో సైనికులకు SRR ఫౌండేషన్ తరఫున రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందించారు. స్వేరో సైనికులకు తన వంతు సహకారంగా ఈ ఆర్థిక చేయూత అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల నాయకులు లేతకుల రంగారెడ్డి, ఐత రామచందర్, ముద్రబోయిన సుధాకర్, చందు, రాము, మైస వెంకటేశం, స్వేరో నాయకులు వశపాక విజయ్ కుమార్, స్వేరో పాలకుర్తి నియోజకవర్గ కో-కన్వీనర్ గారే నరేష్, స్వేరో మండల కన్వీనర్ ఐత జంపి, ఐత మధు, మండల అధ్యక్షులు పిరని రాము, ఐత చందు, ఐత శివ, గౌరీ సతీష్, ఐత వీరన్న తదితరులు పాల్గొన్నారు.