T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విద్యార్థులకు రబ్బీ బాల్స్ పంపిణీ చేసిన పుస్కూరి శ్రీనివాస్ రావు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విద్యార్థులకు రబ్బీ బాల్స్ పంపిణీ చేసిన పుస్కూరి శ్రీనివాస్ రావు

జనగామ, సెప్టెంబర్ 18: (టీజీ 24 ): జనగామ జిల్లా రబ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు రబ్బీ బాల్స్ పంపిణీ చేశారు. అసోసియేషన్ చైర్మన్, మాజీ జనగామ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్ రావు బాల్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు జిల్లాలో రబ్బీ క్రీడ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దొంతమల్ల గణేష్, ఉపాధ్యక్షుడు మామిండ్ల సోమల్లు, ప్రధాన కార్యదర్శి బాలబోయిన సందీప్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రావుల కుమారస్వామి, సంయుక్త కార్యదర్శి జోడు సంతోష్, కోశాధికారి బాలబోయిన నరేష్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.