T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి

సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి

సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి

పర్వతగిరి, ఆగస్టు 17 (టీజీ 24):: సిత్య తండాలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వారా సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. రైతు రమావత్ భిక్ష తదితరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు, కరెంట్, ఎరువులు సమయానికి అందేవని రైతులు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎం. మనోజ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.