T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తెలుగు 24 న్యూస్ కథనానికి వెంటనే స్పందించిన గీసుగొండ పోలీసులు ఊకల్ క్రాస్ వద్ద బురద తొలగింపు – వాహనదారులకు ఊరట

గీసుకొండ, జూలై 09 (టీజీ 24): వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిలోని ఊకల్ క్రాస్ వద్ద రోడ్డుపై పేరుకుపోయిన బురదపై తెలుగు 24 న్యూస్ ప్రచురించిన కథనానికి గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ వెంటనే స్పందించారు. సీఐ డి. విశ్వేశ్వర్, ఎస్‌ఐ అనిల్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం లారీ అసోసియేషన్ ప్రతినిధులు, లారీ డ్రైవర్లు, స్థానికుల సహకారంతో రోడ్డుపై ఉన్న బురద, మట్టిని తొలగించి రహదారిని పరిశుభ్రం చేయించారు. దీంతో వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి. ఈ సందర్భంగా సీఐ డి. విశ్వేశ్వర్ మాట్లాడుతూ, "ప్రజల భద్రతే పోలీసుల తొలి బాధ్యత. సమస్య ఎక్కడ కనిపించినా వెంటనే స్పందించి పరిష్కరించడం మా విధి" అని అన్నారు. లారీ యజమానులు, డ్రైవర్లు ప్రధాన రహదారిపై మట్టి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమస్యపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన గీసుగొండ పోలీసులను స్థానికులు, వాహనదారులు అభినందించారు.