T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీ షిరిడి సాయి పరపతి సంఘం సభ్యుడి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీ షిరిడి సాయి పరపతి సంఘం సభ్యుడి కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం

వర్ధన్నపేట:, జూలై 09 (టీజీ 24): శ్రీ షిరిడి సాయి పరపతి సంఘం సభ్యుడు పరంకుశం శ్రీధర్ అకాల మరణం పట్ల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన సంఘం ప్రతినిధులు రూ.50 వేల మరణ విపత్తు ఆర్థిక సాయాన్ని అందజేసి, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అచ్చి వెంకట శేషశయనం, ప్రధాన కార్యదర్శి దొమ్మటి భానుచందర్, గౌరవ సలహాదారు దీకొండ యుగంధర్, కోశాధికారి మాశేటి సోమయ్య, కార్యవర్గ సభ్యులు గుజ్జ వీరన్న, పెదూరి సంజీవ రావు తదితరులు పాల్గొన్నారు.