TG24TV
రచయిత
ఉద్యోగం పేరుతో రూ.50 వేల వసూలు చేసిన అధికార పార్టీ నాయకులు
TG24TV
రచయిత
ఉద్యోగం పేరుతో రూ.50 వేల వసూలు చేసిన అధికార పార్టీ నాయకులు

రాయపర్తి, నవంబర్ 17 (టీజీ 24): పాలకుర్తి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖలో లష్కర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఏకే తండాకు చెందిన హాలవత్ శ్రీనివాసు నుంచి రూ.50 వేలు వసూలు చేశారంటూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, తండా సర్పంచ్ హాలవత్ సోమ్లాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరుతో కూడిన లెటర్ ప్యాడ్‌పై నియామక పత్రం అందించి నమ్మించారని బాధితుడు ఆరోపించాడు. రెండు విడతల్లో ఆన్లైన్ ద్వారా రూ.20 వేలు, నగదు రూపంలో మరో రూ.30 వేలు చెల్లించినట్లు తెలిపాడు. రెండేళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు తిరిగి అడగగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. దీంతో బాధితుడు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదను ప్రజావాణిలో కలిసి, ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ దుర్వినియోగంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని, చెల్లించిన రూ.50 వేలు తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.