T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బడి ఈడు పిల్లలను బడికి పంపండి -TMPS రాష్ట్ర అధ్యక్షులు మేడ స్వామి

బడి ఈడు పిల్లలను బడికి పంపండి -TMPS రాష్ట్ర అధ్యక్షులు మేడ స్వామి

బడి ఈడు పిల్లలను బడికి పంపండి -TMPS రాష్ట్ర అధ్యక్షులు మేడ స్వామి

వర్దన్నపేట, జూలై 12 (టీజీ 24): వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో తెలంగాణ మాదిగ ప్రజా సమితి (TMPS) ఆధ్వర్యంలో "బడీ ఈడు పిల్లలను బడికి పంపండి" అవగాహన కార్యక్రమం నిర్వహించారు. TMPS రాష్ట్ర అధ్యక్షులు మేడ స్వామి మాదిగ మాట్లాడుతూ విద్యే దళితుల అభివృద్ధికి ప్రధాన మార్గమని, ప్రతి తల్లిదండ్రులు 5 సంవత్సరాలు నిండిన పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన విద్యా మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోల్కొండ శ్రీనివాస్, చెరిపెల్లి భరత్, గజ్జెల్లి రంజిత్, రాజు తదితరులు పాల్గొన్నారు..