T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శ్రావణి కుటుంబానికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం

శ్రావణి కుటుంబానికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం

శ్రావణి కుటుంబానికి SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం

రాయపర్తి, ఆగస్టు 16 టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన గూబ సురేష్ ముదిరాజ్ కుమార్తె గూబ శ్రావణి (17) ఘట్కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడంతో పాటు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గూబ శ్రావణి పార్థివదేహానికి SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. SRR ఫౌండేషన్ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్ పాల్గొన్నారు.