T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు

రాయపర్తి, జూలై 06 (తేజీ 24) జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నూనె అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ఆయన దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం చేసిన సేవలను కొనియాడారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దేశభక్తుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు గడ్డం నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి మందపురి రాజు, యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల గణేష్, జక్కుల సందీప్ యాదవ్, రాకేష్, శివ, నేత్ర సాయి తదితరులు పాల్గొన్నారు.