T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ 38వ అధ్యక్షుడిగా సోమ వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ 38వ అధ్యక్షుడిగా సోమ వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం

వరంగల్, జూలై 20. (టీజీ 24): వరంగల్ హంటర్ రోడ్‌లోని పీఆర్‌ఆర్ వేడుకల మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ 38వ అధ్యక్షుడిగా సోమ వేణుగోపాల్, కార్యదర్శిగా నాయిని అనిల్ కుమార్, కోశాధికారిగా జూలూరి కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నాయిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు కుట్టు మిషన్లు, ప్రభుత్వ పాఠశాలలకు ఐదు సీలింగ్ ఫ్యాన్లు, ములుగు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు రెండు బీరువాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన రోటరీ నాయకులు సేవా కార్యక్రమాల్లో రోటరీ సంస్థ పాత్రను కొనియాడగా, పలువురు రోటరీ క్లబ్‌ల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.