T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పోలీస్ డ్యూటీ మీట్‌లో రెండు పతకాలు సాధించిన కానిస్టేబుల్ బాదె రామయ్యకు ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందనలు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పోలీస్ డ్యూటీ మీట్‌లో రెండు పతకాలు సాధించిన కానిస్టేబుల్ బాదె రామయ్యకు ఎస్పీ డాక్టర్ శబరీష్ అభినందనలు

మహబూబాబాద్, జూలై 16 (టీజీ 24):మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బాదె రామయ్య ఇటీవల మామునూరులో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్‌లో బాంబ్ స్క్వాడ్ యాంటీ సబోటేజ్ చెక్ (రూమ్ సెర్చ్) విభాగంలో స్వర్ణ పతకం, వెహికల్ సెర్చ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసిన రామయ్యను ఎస్పీ అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ మరిన్ని పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కురవి మండలానికి చెందిన బాదె రామయ్య సాధించిన ఈ విజయంపై స్వగ్రామంలో హర్షం వ్యక్తమవుతుండగా, గ్రామ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.