T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అనారోగ్య బాధిత కుటుంబాలకు SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

అనారోగ్య బాధిత కుటుంబాలకు SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

అనారోగ్య బాధిత కుటుంబాలకు SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం

రాయపర్తి, జూలై 11 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూర్ గ్రామంలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు చిన్నపాక ఉప్పలయ్య, చీకటి ఎల్లయ్య, రాపాక మునిశ్వర చారిలను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఐత రామ్‌చందర్ బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిన్నపాక రజిత రాంబాబు, మాజీ సర్పంచ్ నలామాష సారయ్య, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు పోతుల కొమురుమాళ్లు, ఉప సర్పంచ్ చీకటి కర్ణాకర్, పార్టీ నాయకులు ఐత రవి, వేణు, పయ్యాల కొమురుమాళ్లు, యాకమాచారి, మురళి, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.