T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ముదిరాజ్ సంఘం నూతన కమిటీనీ సన్మానించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

ముదిరాజ్ సంఘం నూతన కమిటీనీ సన్మానించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

ముదిరాజ్ సంఘం నూతన కమిటీనీ  సన్మానించిన SRR ఫౌండేషన్  చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

| రాయపర్తి, ఆగస్టు 18 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు మండలం లోని మైలారం గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘం (మత్స్య పారిశ్రామిక సహకార సంఘం) నూతన కమిటీని SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం సర్పంచ్ బాధ అశోక్, ఉప సర్పంచ్ గొడుగు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బోయిని రంజిత్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గబ్బేట యాకయ్య, గబ్బేట కొమురయ్య, బొమ్మినేని సురేందర్ రెడ్డి, చిర్ర బిక్షపతి, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, బోయిని కొమురయ్య, పోతర్ల సమ్మయ్య, బాధ సుధాకర్, బాధ రవి, బోయిని దేవేందర్, కోలా లక్ష్మణ్, ఈర్ల తీర్మాల్, బాధ ప్రభాకర్, బాధ బిక్షపతి, కోలా పున్నం తదితరులు పాల్గొన్నారు.