T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మంగ్యాకు ఆర్థిక సహాయం అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 19 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండా గ్రామానికి చెందిన హలావత్ మంగ్యా అనారోగ్యంతో వరంగల్‌లోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రిలో మంగ్యాను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం SRR ఫౌండేషన్ తరఫున మంగ్యా కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని రాయపర్తి బీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు మాలోత్ వసుంధర్, హలావత్ సంతోష్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.