T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబానికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 31 (టీజీ 24): .వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఇటీవల రామరాపు సంజీవ మృతి చెందారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్పా, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా సంజీవ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బాధిత కుటుంబం సభ్యులను ఓదార్చారు. అనంతరం SRR ఫౌండేషన్ తరపున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయం అందిస్తూ అండగా నిలవడమే SRR ఫౌండేషన్ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, కర్ర రవీందర్ రెడ్డి, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, పెందోట శివ, స్థానిక నాయకులు దేశాబోయిన ఉపేందర్, పెండ్లి వెంకన్న, శాస్రబోయిన యాకయ్య, పెండ్లి సంపత్, ల్యాదేళ్ల ప్రశాంత్, పట్నం సురేష్, పులి ఓంకార్, అడ్లూరి శ్రీను, పెండ్లి నరేష్, కాశి విశ్వనాధ్, చిలుముల స్వామి, పెండ్లి రమేష్, పూస రాజేష్ తదితరులు పాల్గొన్నారు.