TG24TV
రచయిత
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు SRR ఫౌండేషన్చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత
TG24TV
రచయిత
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు SRR ఫౌండేషన్చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత

రాయపర్తి, నవంబర్ 17 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ఊళ్లేంగల రవళి ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నది. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు ఆమెను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తూ SRR ఫౌండేషన్ తరఫున రూ.2,500 ఆర్థిక సహాయం అందించారు. ఈ ఆర్థిక సహాయాన్ని రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, వార్డు నెంబర్లు పరుపాటి రవీందర్ రెడ్డి, బెల్లి అనూష ఎల్లయ్య బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, గబ్బేట యాకయ్య, గుడెల్లి వెంకటయ్య, గబ్బేట కొమురయ్య, పశునూరి శ్రీనివాస్, బొమ్మినేని సురేందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, చెన్నంగి తదితరులు పాల్గొన్నారు.