TG24TV
రచయిత
యూత్ కమిటీలకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
యూత్ కమిటీలకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 10 (టీజీ 24): యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంత యువతకు క్రీడా సామగ్రిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జయరాం తండా (ఎస్) గ్రామంలోని స్థానిక యూత్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు రెండు క్రికెట్ కిట్లను యూత్ కమిటీ సభ్యులకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, గుగులోత్ గౌస్ నాయక్, పెందోట శివ, ఐత జంపి, గారే నరేష్, పీరని రాజుతో పాటు స్థానిక వార్డు నంబర్లు, పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.