TG24TV
రచయిత
బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన న SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
TG24TV
రచయిత
బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన న SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 07 (టీజీ 24): సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న SRR ఫౌండేషన్ మరోసారి తన మానవతా చాటుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం శివరామపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చెడుపాక (సుతారి) యాకయ్య సతీమణి చెడుపాక యాకలక్ష్మి గత 15 రోజులుగా హైదరాబాద్ సూరారం సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి యాకలక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు, SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.