T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాలకు అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబాలకు అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబాలకు అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 02 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిట్యాల జగదంబ, అరురి లక్ష్మి కుటుంబాలను ఆదివారం SRR ఫౌండేషన్ ప్రతినిధులు పరామర్శించారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, "సేవే పరమో ధర్మం" అనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక్కో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్ అందజేసి అండగా నిలిచారు. ఈ సహాయ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు వంగల నరసయ్య, పార్టీ నాయకులు చిట్యాల వెంకన్న, తోట నరసింగం, తోట నందు, మాచర్ల సోమనారాయణ, చిట్యాల సోమయ్య, సత్తూరి వెంకన్న, తోట కృష్ణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు.