T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విధులు నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఎస్సై వెంకన్న
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విధులు నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఎస్సై వెంకన్న

రాయపర్తి, సెప్టెంబర్ 24 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన కునుసోతు వెంకన్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తునాడు. గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో బందోబస్త్ విధులు నిర్వహించవలసి రావడం తో విధులు నిర్వహిస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి మృతిచెందారు. అంత్యక్రియలు స్వగ్రామం రాయపర్తి మండలం కిష్టాపురంలో అధికారిక పోలీసు లాంఛనాలతో ఘనంగా నిర్వహణ చేశారు. వెంకన్న మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తో పాటు పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించి అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికారు.