T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కేజీబీవీ విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన స్వెరోస్

కేజీబీవీ విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన స్వెరోస్

కేజీబీవీ విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసిన స్వెరోస్

పర్వతగిరి, జూలై 22 (టీజీ 24): పర్వతగిరి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో స్వేరోస్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 34 మంది అనాథ, సెమీ అనాథ విద్యార్థినులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఏ. బిక్షపతి, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ కె. నవీన్ కుమార్ పాల్గొని స్వేరోస్ సేవలను అభినందించారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అతిథులు సూచించారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్ స్వేరో అధికార ప్రతినిధి గారె జయరాజ్. స్వేరోస్ నాయకులు పాఠశాల సీ ఆర్ టి లు గూగులోత్ పద్మ , బత్తుల పద్మ , శోభారాణి , ఏ. రాణి, జీ.సునీత వై వి భారతి , దివ్య కేజీబీవి విద్యార్థినిలు పాల్గొన్నారు.