TG24TV
రచయిత
గంజాయి తో పట్టుబడ్డ నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు
TG24TV
రచయిత
గంజాయి తో పట్టుబడ్డ నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు

వర్దన్నపేట, సెప్టెంబర్ 28 (టీజీ 24): వర్దన్నపేట మండలం కట్ర్యాల గ్రామనికి చెందిన ముత్యాల శ్యామ్ వర్దన్నపేట కు చెందిన పిన్నింటి భరత్ ఇద్దరు కలిసి గత రెండు మూడు సంవత్సరాల నుండి గంజాయి అమ్ముతు సేవిస్తూన్నారు. ఇదే క్రమంలో గత 10 రోజుల క్రితం ముత్యాల శ్యామ్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుండి వైజాగ్ అరకులో తన పాత..స్నేహితుడు సుభాష్ వద్దకు వెళ్లి ఒక ప్యాకెట్ లో ఎండు గంజాయి ని ట్రైన్ లో కాజిపేట్ వరకు తీసుకోని వచ్చి వర్దన్నపేట లో తన స్నేహితులకు అమ్మటానికి ముత్యాల శ్యామ్, పిన్నింటి భరత్ లు ఇద్దరు కలిసి కట్రాల నుండి వర్దన్నపేటకు ఆటోలో వస్తూ ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వద్ద వర్దన్నపేట పోలీస్ వారికి పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న ఒక కిలో గంజాయి విలువ 50,000/- వరకు ఉంటుందనీ . నిందుతులను అదుపులోకి తీసుకోని పూర్తి వివరాలు సేకరించి ఇద్దరిని రిమాండు కు తరలించారు .