T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శీతల – తీజ్ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వ సెలవు ప్రకటించాలి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శీతల – తీజ్ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వ సెలవు ప్రకటించాలి

రాయపర్తి, జూలై 07 (టీజీ 24) భారతదేశంలోని గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే శీతల మరియు తీజ్ పండుగలు గిరిజన పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది 07-07-2026 (మంగళవారం) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఏకకాలంలో ఈ పండుగలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శీతల, తీజ్ పండుగల ప్రాముఖ్యతను గుర్తించి, గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగలకు అధికారిక సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజనుల తరఫున ఎం. రవి నాయక్ (మాజీ ఉప సర్పంచ్), ఈర్య, మోహన్, చంద్రు, శ్రీను, నారాయణ, రమేష్, లచిరం విజ్ఞప్తి చేశారు.