T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఉపాధ్యాయుడు హాజరు బడిలో - తిరుగుడు బయట

ఉపాధ్యాయుడు హాజరు బడిలో - తిరుగుడు బయట

ఉపాధ్యాయుడు హాజరు బడిలో - తిరుగుడు బయట

రాయపర్తి, జూలై 09 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో LFL HM గా విధులు నిర్వహిస్తున్న ప్రసాదరావు పాఠశాల హాజరు రిజిస్టర్‌లో హాజరు నమోదు చేసిన అనంతరం పీఆర్టీయూ–టీఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. విధి సమయంలో ఉపాధ్యాయుడు పాఠశాల వెలుపల కార్యక్రమంలో పాల్గొన్నారా? దీనికి సంబంధిత అధికారుల అనుమతి ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.