TG24TV
రచయిత
తూతూ మంత్రంగా రాయపర్తి మండల తొలి సర్వసభ్య సమావేశం
TG24TV
రచయిత
తూతూ మంత్రంగా రాయపర్తి మండల తొలి సర్వసభ్య సమావేశం

రాయపర్తి, జూలై 31 (టీజీ24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల తొలి సర్వసభ్య సమావేశం శుక్రవారం తూతూ మంత్రంగా నిర్వహించినట్లు సమావేశానికి హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభిప్రాయపడ్డారు. మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై నివేదికలను సమావేశంలో సమగ్రంగా వివరించాల్సి ఉండగా, ఆ ప్రక్రియ నామమాత్రంగానే సాగిందని పలువురు పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులకు ఇది తొలి మండల సర్వసభ్య సమావేశం కావడంతో వారు ఎంతో ఆసక్తిగా హాజరయ్యారు. అయితే గత సమావేశాల్లో మాదిరిగా అన్ని శాఖల సమాచారాన్ని పొందుపరిచిన బుక్‌లెట్‌ను సభ్యులకు అందజేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. అధికారులు చదివిన నివేదికల్లో ఏముందో, సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఏ అంశాలను తెలుసుకున్నారో స్పష్టత లేకుండా సమావేశం ముగిసిందని కొందరు సభ్యులు సమావేశం అనంతరం గుసగుసలాడారు. కేవలం సమావేశం నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వహించినట్లుగా కార్యక్రమం సాగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.