T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా  టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, స్థానిక సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఝాన్సీ రాజేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.