TG24TV
రచయిత
మబ్బుల ముసుగులో భద్రకాలి సమేత వీరభద్ర స్వామి ఆలయం.. భక్తులను, చూపరులను ఆకట్టుకుంటున్న ఆహ్లాదకర దృశ్యం
TG24TV
రచయిత
మబ్బుల ముసుగులో భద్రకాలి సమేత వీరభద్ర స్వామి ఆలయం.. భక్తులను, చూపరులను ఆకట్టుకుంటున్న ఆహ్లాదకర దృశ్యం

కురవి, సెప్టెంబర్ 12 (టీజీ 24): మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రముఖ భద్రకాలి సమేత వీరభద్ర స్వామి దేవాలయం లో శనివారం ఉదయం దట్టమైన మబ్బులతో కమ్ముకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ పరిసరాలను మబ్బులు పూర్తిగా ఆవరించడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలతో కనువిందు చేసింది. మబ్బుల పొరల మధ్య ఆలయ శిఖరం కనిపించిన తీరు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. సాధారణ రోజుల్లో కనిపించే ఆలయ దృశ్యానికి భిన్నంగా, మబ్బుల మధ్య ఆలయం దర్శనమివ్వడం ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఉదయం వేళ ఆలయ పరిసరాల్లో నెలకొన్న చల్లని వాతావరణం, మబ్బుల అందాలు భక్తులు, స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను పలువురు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించుకుని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మబ్బుల చాటున ఆలయం.. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక సోయగం అంటూ స్థానికులు ఈ దృశ్యాన్ని ఆస్వాదించారు.