TG24TV
రచయిత
వరంగల్ ఎయిర్‌పోర్టు 2028 జూన్ 2 నాటికి పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి టీడీపీ నేతల కృతజ్ఞతలు
TG24TV
రచయిత
వరంగల్ ఎయిర్‌పోర్టు 2028 జూన్ 2 నాటికి పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి టీడీపీ నేతల కృతజ్ఞతలు

వరంగల్, జూలై 16 (టీజీ 24): ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హనుమకొండలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం వరంగల్, ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు హనుమకొండ సాంబయ్య, పార్లమెంట్ కార్యదర్శి, కాగితాల జయశంకర్, పరకాల నియోజకవర్గ బాధ్యులు,కందుకూరి నరేష్, తెలుగు యూత్ రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్, ఆత్మకూరు మండల అధ్యక్షులు మరుగిద్దె రాజేశ్వర్ రావు, గీసుగొండ మండల కార్యదర్శి తాటి సాంబశివరావు,ఆత్మకూరు మండలం ఉపాధ్యక్షలు,కొక్కరకొండ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.