T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి 100 కార్లలో హైదరాబాద్‌కు బయలుదేరిన వరంగల్ కాంగ్రెస్ శ్రేణులు

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి 100 కార్లలో హైదరాబాద్‌కు బయలుదేరిన వరంగల్ కాంగ్రెస్ శ్రేణులు

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి  100 కార్లలో హైదరాబాద్‌కు బయలుదేరిన  వరంగల్ కాంగ్రెస్ శ్రేణులు

వరంగల్, నవంబర్ 26 (టీజీ 24): భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షా ర్యాలీ’లో పాల్గొనేందుకు వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పాల్గొనేందుకు సుమారు 100 కార్లలో కాంగ్రెస్ శ్రేణులు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాయి. భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.