T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నల్లగొండ నర్సయ్య అంతిమయాత్రలో పాల్గొన్న వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకులు

నల్లగొండ నర్సయ్య అంతిమయాత్రలో పాల్గొన్న వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకులు

నల్లగొండ నర్సయ్య  అంతిమయాత్రలో పాల్గొన్న వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకులు

వర్ధన్నపేట, ఆగస్టు 02 (టీజీ 24): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లగొండ రమేష్ తండ్రి నల్లగొండ నర్సయ్య మరణించడంతో, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ నరుకుడు వెంకటయ్య, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మరుపట్ల సాయికుమార్ తిమ్మంపేట గ్రామంలో నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని నర్సయ్య. పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం నల్లగొండ రమేష్ ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.