T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కెనాల్ ద్వారా నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి: బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

రాయపర్తి, జూలై 17 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారు ఎస్సారెస్పీ కెనాల్ వద్ద కెనాల్ ద్వారా. సాగునీరు అందించాలని, 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా కల్పించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి. ఆధ్వర్యంలో. రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మైలారం విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు నిర్వహించిన నిరసనలో రైతులు మాట్లాడుతూ, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రైతులకు నిరంతరాయంగా 24 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ రైతు నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.