T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కుమారస్వామి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే KR నాగరాజు

కుమారస్వామి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే KR నాగరాజు

కుమారస్వామి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే KR నాగరాజు

వర్దన్నపేట, ఆగస్టు 08 (టీజీ 24): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన పైండ్ల కుమారస్వామి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే K R నాగరాజు నల్లబెల్లి గ్రామానికి చేరుకుని కుమార స్వామి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుమారస్వామి భార్యకి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,మండల అధ్యక్షులు పోశాల వెంకన్న ,ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గౌడ్, వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ రాజేష్ ఖన్నా,వర్ధన్నపేట మాజీ మండల అధ్యక్షులు ఎద్దు సత్తెన్న,నల్లబెల్లి మాజీ గ్రామశాఖ అధ్యక్షులు దిలీప్,సీనియర్ నాయకులు బిర్రు రాజు,సాయికుమార్, తుల్ల రవి, జక్కి గోపాల్,మండల,గ్రామ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.