T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ఉద్దేశమేంటో?
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ఉద్దేశమేంటో?

పాలకుర్తి, సెప్టెంబర్ 28 (టీజీ 24): సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీఐ సమాచార బోర్డుపై సమాచార అధికారి , సహాయ సమాచార అధికారి, అప్పీల్ అధికారుల వివరాలు పేర్కొన్నప్పటికీ.. సంబంధిత అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు పూర్తిస్థాయిలో లేకపోవడం గమనార్హం ప్రజలకు సమాచార హక్కు కల్పించేందుకు ఏర్పాటు చేసిన బోర్డులోనే పూర్తి సమాచారం లేకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి బోర్డుపై సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పీలేట్ అధికారి పేర్లతో పాటు వారి కార్యాలయ ఫోన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు.