T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాలకుర్తి కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఎక్కడ? – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వినతి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పాలకుర్తి కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం ఎక్కడ? – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వినతి

పాలకుర్తి, జూలై 14 (టీజీ 24): పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో దళితులకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. సీనియర్ కార్యకర్తలను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని, ఆరు మండలాల్లో ఒక్క దళితుడికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్, దళితులకు ప్రాతినిధ్యం లేకపోవడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ, పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేస్తామని, పాలకుర్తి ఇన్‌చార్జితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.