T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట, జూలై 11 (టీజీ 24): వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 43వ డివిజన్‌లో పలు బాధిత కుటుంబాలను శనివారం పరామర్శించారు. ఇటీవల మృతిచెందిన మేడల ప్రభాకర్, లింగాల యాదగిరిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అనారోగ్యంతో ఉన్న మాదాసి రాజును పరామర్శించి, వైద్యానికి అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. యాదగిరి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందజేశారు.ఈ కార్యక్రమల్లో డివిజన్ అధ్యక్షులు మాడుగుల రాజ్ కుమార్,డివిజన్ మాజీ అధ్యక్షులు చింత ప్రకాష్,సీనియర్ నాయకులు కొమురెల్లియాదవ్,దశరథం, శివకుమార్,డివిజన్ ముఖ్య నాయకులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.