T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

మామునూరు పశువైద్య కళాశాలలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం

మామునూరు పశువైద్య కళాశాలలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం

మామునూరు పశువైద్య కళాశాలలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం

మామునూరు, జూలై 06: (టీజీ 24) పశువైద్య శాస్త్ర కళాశాలలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం–2026ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగెం మండలానికి చెందిన మూడు పాఠశాలల విద్యార్థులకు జూనోసిస్ వ్యాధులపై క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస రెడ్డి, ఎంఈఓ ఎస్. నరసింహాచార్యులు, డా. ప్రదీప్ కుమార్ బహుమతులు అందజేశారు. వక్తలు జూనోసిస్ వ్యాధుల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత, పశువుల ఆరోగ్య సంరక్షణ, సకాలంలో టీకాలు, ప్రజల్లో అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు.