T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలన చిరస్మరణీయం- ఇనుగాల వెంకట్రామిరెడ్డి

వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలన చిరస్మరణీయం- ఇనుగాల వెంకట్రామిరెడ్డి

వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలన చిరస్మరణీయం- ఇనుగాల వెంకట్రామిరెడ్డి

వరంగల్, జూలై 08 (టీజీ 24 ): దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా హనుమకొండ డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు భరోసా నిధుల విడుదలను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలన చిరస్మరణీయమని, రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.