T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

హనుమకొండ, ఆగస్టు 09 (టీజీ 24): యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువత పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని దిలీప్ రాజ్ పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో యువత సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలిపారు.