గోత్తికోయల సమస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చ

గోత్తికోయల సమస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చ

తాడ్వాయి, ఆగస్టు 13 (టీజీ 24) గోత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు కోరారు. తాడ్వాయి రేంజర్ రమేష్, DRO కృష్ణవేణిలను చిటమట రఘు మర్యాదపూర్వకంగా కలిసి గోత్తికోయల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గోత్తికోయలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గోత్తికోయల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చిటమట రఘు తెలిపారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, PACS డైరెక్టర్ వంగపండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా కార్యదర్శి గా షేక్ అక్బర్ పాషా నియామకం

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా కార్యదర్శి గా షేక్ అక్బర్ పాషా నియామకం

సమాచార హక్కు చట్ట పరిరక్షణ సంస్థ ములుగు జిల్లా కార్యదర్శిగా షేక్ అక్బర్ పాషా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్ నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అక్బర్ పాషా మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపడతానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ బలోపేతానికి నిబద్ధతతో పనిచేస్తానన్నారు. ఆయన నియామకంపై కమిటీ నాయకులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.